చండీగఢ్: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపైగా ఢిల్లీ శివారులో నిరసన తెలిపి, ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా చేసి ఇండ్లకు తిరిగి వస్తున్న రైతులకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఢిల్లీ నుంచి పంజాబ్-హర్యానా సరిహద్దు ప్రాంతమైన శంభుకు వాహనాల్లో చేరిన రైతులపై విమానం ద్వారా పూల వర్షం కురిపించారు. ఈ విమానాన్ని ఒక ప్రవాస భారతీయుడు ఏర్పాటు చేశారు.
వివాదస్పద మూడు వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతోపాటు కనీస మద్దతు ధర, రైతులపై నమోదైన కేసుల తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏడాదికిపైగా కొనసాగిన తమ ఆందోళనను విరమిస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇటీవల ప్రకటించింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి నిరసన ప్రాంతాలను రైతులు ఖాళీ చేస్తారని తెలిపింది. ఆ ప్రాంతాలను రైతులు పూర్తిగా ఖాళీ చేసేందుకు నాలుగైదు రోజులు పడుతుందని పేర్కొంది.
Flower petals being showered on farmers.
— Tractor2ਟਵਿੱਟਰ (@Tractor2twitr) December 11, 2021
Yes, they deserve this grand welcome.#FarmersProtest_FatehMarch pic.twitter.com/1eu9Lyd5Di