న్యూఢిల్లీ, నవంబర్ 8: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం తలెత్తిన సాంకేతిక సమస్య (ఏటీసీ క్రాష్).. నివారించగలిగేదని ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్ల ‘గిల్డ్’ పేర్కొన్నది. నావిగేషన్ వ్యవస్థలో లోపాలు, అప్‌గ్రేడేషన్ గురించి అక్కడి ఏటీసీ సిబ్బంది ‘ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఏఏఐ) ముందుకు జూలైలోనే తీసుకొచ్చిందని ‘గిల్డ్’ తెలిపింది. అయితే, తాము లేవనెత్తిన అంశాల్ని, చేసిన సూచనలను ఏఏఐ పట్టించుకోలేదని ఆరోపించింది.
శనివారం ఈ మేరకు ఏటీసీ గిల్డ్ ఒక ప్రకటన విడుదల చేసింది. అహ్మదాబాద్ విమాన దుర్ఘటన తర్వాత జూలై 8న పార్లమెంట్ ఎంపీలందరికీ తాము లేఖ రాశామని, ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్‌లో ఆటోమేషన్ సిస్టంను సమీక్షించాలని, అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరముందని ఆ నాటి లేఖలో ప్రస్తావించినట్టు గిల్డ్ తెలిపింది.