Delhi Air Pollution | జాతీయ రాజధాని ఢిల్లీ నగరం వాయు కాలుష్యంతో సతమతమవుతోంది. దీపావళి వేడుకలు జరిగిన మూడు రోజుల తర్వాత కూడా ఎయిర్ క్వాలిటీ దారుణంగా ఉన్నది. గురువారం ఉదయం 5.30 గంటలకు సగటున ఢిల్లీలో వాయు నాణ్యత 325 వద్ద నమోదైంది. చాలా ప్రాంతాలు రెడ్‌జోన్‌లోనే ఉన్నాయి. ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం సమీపంలోని దృశ్యాలు దృశ్యమానత తగ్గిపోయింది. తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో 300 నుంచి 400 మధ్య ఏక్యూఐ నమోదైంది. గురువారం ఉదయం 5.30 గంటలకు ఏక్యూఐ 511 వద్ద ఉంది.
ఇదిలా ఉండగా.. సీపీసీబీ నివేదిక ప్రకారం.. దీపావళి తర్వాత ఢిల్లీ నగరంలో గాలి నాణ్యత భారీగా పడిపోయింది. నగరం పీఎం 2.5 స్థాయి ఐదు సంవత్సరాల్లో అత్యంత దారుణంగా పెరిగాయి. దీపావళి తర్వాత 24 గంటల్లో సగటు PM 2.5 సాంద్రత క్యూబిక్ మీటర్‌కు 488 మైక్రోగ్రాములకు చేరుకుంది. పండుగకు ముందు క్యూబిక్ మీటర్‌కు 156.6 మైక్రోగ్రాముల కంటే మూడు రెట్లు ఎక్కువ. 2021 నుంచి 2025 వరకు దీపావళి రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం PM 2.5 స్థాయి క్రమంగా పెరుగుతూ వస్తుంది. సగటు PM 2.5 స్థాయి 2021లో 163.1గా నమోదైంది. గాలి కాలుష్యం జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ నగరంలో ఆంక్షలు అమలులోకి వచ్చాయి. పూసాలో 344, ఐఎండీ 333, షాదిపూర్ 318, పంజాబీభాగ్ 342, నార్త్ క్యాంపస్ 321, ముడ్కా 30, మందిర్ మార్గ్ 320, అశోక్ విహార్ 350, ఛాందిని చౌక్‌లో 328 ఏక్యూఐ నమోదైంది.