న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శనివారం అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 400 స్థాయిని దాటడంతో.. నగరం రెడ్జోన్లో వెళ్లిపోయింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయిలు 400 దాటాయి.
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ డాటా ప్రకారం, శనివారం గత 24 గంటల సగటు (మధ్యాహ్నం 4గంటలకు) 361గా నమోదు కాగా, అంతకు ముందు శుక్రవారం ఇది 322గా ఉంది. శనివారం వజీర్పూర్ వద్ద 420, బూరీరీ- 418, వివేక్ విహార్-411, నెహ్రూ నార్-406గా నమోదైంది.