న్యూఢిల్లీ: ఏస్ ఫైటర్ పైలట్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నూతన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన భారత వైమానికి దళానికి సంబంధించిన ఆధునికీకరణ బాధ్యతలు చూడనున్నారు. అదేవిధంగా భారత వైమానిక దళంలో కొత్త జరిగే కొనుగోళ్లను కూడా పర్యవేక్షించనున్నారు. భారత రక్షణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
భారత వైమానిక దళం ప్రస్తుతం దేశీయ పరిశ్రమల నుంచి కొత్త యుద్ధ విమానాలైన LCA మార్క్ 1 A, LCA మార్క్ 2, అధునాతన మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలును, అదేవిధంగా ప్రధాన కొనుగోళ్లను ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ పర్యవేక్షించనున్నారు. కాగా, అశుతోష్ దీక్షిత్ 1986 డిసెంబర్ 6న భారత వైమానిక దళంలో చేరారు.