ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు
పుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణ సమయంలో విమానం 300 అడుగుల మేర కిందకు జారిపోవడంతో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లైట్ ఏఐ2379 మంగళవారం పుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది.
- 300 అడుగుల మేర కిందికి
- భయంతో వణికిపోయిన ప్రయాణికులు
- 12 మందికి గాయాలు
న్యూఢిల్లీ : పుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణ సమయంలో విమానం 300 అడుగుల మేర కిందకు జారిపోవడంతో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లైట్ ఏఐ2379 మంగళవారం పుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. గమ్యస్థానానికి చేరుకునే క్రమంలో మార్గమధ్యంలో విమా నం తీవ్రమైన కుదుపులకు గురై, ఒక్కసారిగా 300 అడుగుల మేరకు కిందకు జారిపోయింది. దీంతో విమానంలోని ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనలో 12 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం విమానాశ్రయ వైద్య కేంద్రానికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో దవాఖానకి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానం లోపలి సీలింగ్ భాగాలు దెబ్బతిన్నాయని సమాచారం. ప్రయాణం ప్రారంభమైన గంటన్నర తర్వాత విమానం భారీ కుదుపులకు గురైందని, రెండు మూడు నిమిషాల పాటు భయానక వాతావరణం నెలకొందని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పౌరవిమానయాన భద్రతా డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) దర్యాప్తునకు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

