పిల్లలకో ప్రొటీన్ షేక్
పిల్లలకు అనారోగ్య సమస్యలేవీ ఉండవు. అయినా ఎదుగుదల తక్కువగా ఉంటుంది. బాగానే తింటున్నారని తల్లిదండ్రులు చెబుతారు. కానీ ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉండరు. ఇలాంటి పిల్లలకు ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి. అయితే సహజంగానే పిల్లలు రుచికరమైనవి ఎక్కువగా తింటారు.
పిల్లలకు అనారోగ్య సమస్యలేవీ ఉండవు. అయినా ఎదుగుదల తక్కువగా ఉంటుంది. బాగానే తింటున్నారని తల్లిదండ్రులు చెబుతారు. కానీ ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉండరు. ఇలాంటి పిల్లలకు ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి. అయితే సహజంగానే పిల్లలు రుచికరమైనవి ఎక్కువగా తింటారు. ఇలాంటి పిల్లలు జ్యూస్ తాగేందుకు ఇష్టపడుతుంటే ప్రొటీన్ లోపాన్ని సరిచేసే బనానా పీనట్ షేక్ తయారు చేసుకోవచ్చు.
గుప్పెడు పల్లీలు అయిదు గంటలు నీళ్లలో నానబెట్టాలి. నానిన తర్వాత కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక అరటిపండు (సుమారు వంద గ్రాములు) తొక్క తీసిన తర్వాత ముక్కలుగా తరగాలి. పల్లీలు, అరటి ముక్కలు మిక్సీ జార్లో వేసి మెత్తగా అయ్యేలా చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక కప్పు చిక్కని కొబ్బరి పాలు కలపాలి.
ఈ షేక్‌ని ఒక గ్లాస్లోపోసి బాదంపప్పు పొడి చల్లి పిల్లలకు ఇవ్వాలి. ఆటల్లో అలసిపోయినప్పుడు, స్కూల్ నుంచి వచ్చినప్పుడు పిల్లలు ఆకలితో ఉంటారు. ఆ సమయంలో ఇస్తే వారికి సత్వర శక్తి అందుతుంది. ఇక ఎదుగుదల తగ్గడానికి కారణమైన ప్రొటీన్, ఇతర పోషకాలు పుష్కలంగా అందుతాయి. అలాగే మెదడు ఎదుగుదలకు సహాయపడే పోషకాలు కూడా ఈ షేక్‌లో ఉంటాయి. వారానికి ఒకసారైనా ఈ షేక్ పిల్లలకు ఇచ్చేందుకు ప్రయత్నించండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

