గువాహటి, జూన్ 15: శనివారం గువాహటి నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య.. 170 మంది విమాన ప్రయాణికులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. శనివారం రాత్రి 9.20 గంటలకు విమానాన్ని ఎక్కితే, 18 గంటల ఆలస్యంగా ఆదివారం మధ్యాహ్నం బయల్దేరింది.
ఫ్లైట్ ఐఎక్స్-1226లో సాంకేతిక సమస్య తలెత్తటంతో లోక్ప్రియ గోపీనాథ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులందర్నీ రెండుమార్లు ఫ్లైట్ నుంచి కిందకి దింపారు. దీంతో ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలో అత్యంత బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారని తెలిసింది.