Pran Pratishtha | హాఫ్ డే ఉత్తర్వులు వెనక్కితీసుకున్న ఎయిమ్స్
Pran Pratishtha : అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయ ప్రారంభోత్సవ వేడుకల నేపధ్యంలో ఈనెల 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకూ హాఫ్ డే ప్రకటించిన ఢిల్లీ ఎయిమ్స్ విమర్శల వెల్లువతో తన ఉత్తర్వులను వెనక్కుతీసుకుంది.
Pran Pratishtha : అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయ ప్రారంభోత్సవ వేడుకల నేపధ్యంలో ఈనెల 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకూ హాఫ్ డే ప్రకటించిన ఢిల్లీ ఎయిమ్స్ విమర్శల వెల్లువతో తన ఉత్తర్వులను వెనక్కుతీసుకుంది. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవుట్ పేషెంట్ విభాగం సేవలు కొనసాగుతాయని అధికారిక ప్రకటనలో ఎయిమ్స్ పేర్కొంది.
అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకల నేపధ్యంలో జనవరి 22న హాఫ్ డే ప్రకటిస్తూ శనివారం ఎయిమ్స్ ఢిల్లీ నిర్ణయం తీసుకుంది. 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకూ ఆస్పత్రి మూసివేస్తామని పేర్కొంది. అత్యవసర విభాగాల సేవలు కొనసాగుతాయని ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి తెలిపారు. అయితే ఎయిమ్స్ హాఫ్ డే నిర్ణయంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఆరోగ్య సేవలకు భగ్నం వాటిల్లుతుందని అభ్యంతరం వ్యక్తం చేశాయి.
శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా 22న మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తేలా చేయకండి..తనకు స్వాగతం పలికేందుకు ఆరోగ్య సేవలకు భగ్నం కలిగించేందుకు రాముడు అంగీకరించాడా అనే విస్మయం కలుగుతోందని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. ఢిల్లీ ఎయిమ్స్ నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే కూడా తప్పుపట్టారు. వైద్యుల అపాయింట్మెంట్ కోసం ప్రజలు ఎయిమ్స్ గేట్ల వద్ద చలిలో పడిగాపులు పడుతుందటారని, మోదీ ప్రభుత్వం కెమెరాలకు, ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో రోగులు వేచిచూడాలని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Read More :
Turbans | వాళ్లు దాదాపు 500 ఏళ్ల తర్వాత తలపాగలు ధరించారు.. ఎందుకో తెలుసా..? Video
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

