బెంగళూరు: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఏ క్షణంలోనేనా పడిపోవచ్చని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. అయితే తాము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదని చెప్పారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు పొరపాటున జరిగిందన్నారు. మోదీకి మరో అవకాశం లేదని చెప్పుకొచ్చారు. ఇది మైనార్టీ ప్రభుత్వమని ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉందని చెప్పారు. కానీ, తాము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.
దేశ ప్రజలకు మంచి జరగడం కోసం తాము ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దేశాన్ని పటిష్టం చేయడానికి మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. దేశానికి మంచి జరగనివ్వకుండా చేయడం ప్రధాని మోదీకి అలవాటని విమర్శించారు. కానీ, ఇండియా కూటమి మాత్రం పరస్పరం సహకరించుకుంటూ దేశాన్ని పటిష్ట పరుచుకోవాలని కోరుకుంటుందన్నారు.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 241 సీట్లు గెలుపొందింన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ మార్కు 272నే చేరుకోలేపోయింది. దీంతో టీడీపీ, జేడీయూ వంటి మిత్రపక్షాలతో కలిసి ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
NDA सरकार गलती से बनी हुई है। मोदी जी के पास बहुमत नहीं है।
यह अल्पमत सरकार है, जो कभी भी गिर सकती है।
: कांग्रेस अध्यक्ष श्री @kharge pic.twitter.com/7GWmrTSPYE
— Congress (@INCIndia) June 14, 2024