Free Bus | ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. హామీలు ఇచ్చేందుకు రెడీగా ఉంటాయి రాజకీయ పార్టీలు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు ఆ హామీలు అమలవుతున్న సమయంలో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తిన సందర్భాలు చాలా కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి హామీల్లో ఒకటి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. ఈ స్కీమ్ అనగానే మొదట గుర్తొచ్చేది కర్ణాటక రాష్ట్రం. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసింది. ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు స్కీమ్‌ను అమలు చేసింది.
అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఉచిత ప్రయాణాలపై హర్షాతికాల కన్నా.. విమర్శలే ఎక్కువగా వస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ స్కీమ్ అమలవుతున్న విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో ఆడవాళ్లకేనా.. మగవాళ్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలంటూ డిమాండ్లు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ డిమాండ్‌ను ఓ రాజకీయ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి అందరి ఫోకస్ తనవైపు తిప్పకునే పనిలో పడింది. ఇంతకీ ఈ ఆఫర్ ఎక్కడనుకుంటున్నారా..? తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏఐఏడీఎంకే పార్టీ తమ ఎన్నికల వాగ్ధానాల్లో ఈ హామీని ప్రకటించింది.
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిటీ బస్సుల్లో మగవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అమలు చేస్తామని ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ ఇడప్పడి కే పళనిస్వామి ప్రకటించారు. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి పురుషులపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ఇప్పటికే మహిళలకు సిటీ బస్సుల్లో ఉన్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అలాగే కొనసాగుతుందని వెల్లడించారు. మరి ఈ స్కీమ్ ఎంతమందిని ఆకరిస్తుంది.. ఏఐఏడీఎంకేను గెలిపించడంలో కీ రోల్ పోషిస్తుందా..? అనేది ఆసక్తి నెలకొంది. మొదటి దశ ఎన్నికల వాగ్ధానాల్లో మరో నాలుగు హామీలను కూడా ప్రకటించింది ఏఐఏడీఎంకే.
Chennai, Tamil Nadu: AIADMK General Secretary Edappadi K Palaniswami announces the first phase of the party’s election promises
1) Women’s Welfare (Kulavilakku Scheme) Under the Kulavilakku Scheme, a monthly financial assistance of Rs 2,000 will be provided to all ration… pic.twitter.com/gvwHa0126I
— ANI (@ANI) January 17, 2026