న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: భారతదేశ సాంకేతిక సేవల రంగాన్ని కృత్రిమ మేధ(ఏఐ) దెబ్బ తీస్తుందనే ఆందోళనను దేశంలోని సాంకేతిక పరిశ్రమ అత్యున్నత సంస్థ నాస్కామ్ తోసిపుచ్చింది. బదులుగా ఏఐ పరిశ్రమ పాత్రను పునర్నిర్వచించి మెరుగుపరుస్తుందని నాస్కామ్ నమ్ముతోంది. నాస్కామ్ అభిప్రాయం ప్రకారం వివిధ నిర్వహణలలో లక్ష్యాలను ఆటోమేట్ చేసే ఆంథ్రోపిక్‌కు చెందిన క్లౌడ్ కోవర్క్ వంటి కొత్త సాధనాలు భారత ఐటీ సేవలను అధిగమించవు. బదులుగా వాటి సామర్థ్యాలను పెంచుతాయి. భారతదేశ సాంకేతిక సేవల రంగానికి అవరోధం కల్పిస్తున్న న్యాయ, అమ్మకాలు, మార్కెటింగ్, డాటా విశ్లేషణ వంటి రంగాలలో ఆంథ్రోపిక్ క్లౌడ్ కోవర్క్ , ఆటోమేటింగ్ ఫంక్షన్ల వంటి కొత్త సాధనాల గురించి ఆందోళనలు పొరపాటని పేర్కొంది. భారత సాంకేతిక సేవల కంపెనీలు ఒకదానితో ఒకటి అనుసంధానం చెందిన వ్యవస్థలే గాక క్లిష్టమైన సాంకేతిక వాతావరణంలో పనిచేసే ప్రపంచ కంపెనీలతో దగ్గరగా పనిచేస్తాయని నాస్కామ్ పేర్కొంది. భారతీయ టెక్ సంస్థలు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతున్నాయని నాస్కామ్ అభిప్రాయపడింది.