న్యూఢిల్లీ : కేవలం మామోగ్రామ్, వయసు రికార్డుల ఆధారంగా మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనావేయగల ఓ ఏఐ పరికరాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆస్ట్రేలియాలో 49 వేల మందికి పైగా మహిళలమామోగ్రామ్, మరణ రికార్డులను ఉపయోగించి ఈ ఏఐ పరికరానికి శిక్షణ ఇచ్చారని ‘హార్ట్’ వైద్య పత్రికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొన్నది.
ఈ ఏఐ టూల్ ద్వారా ఒకే పరీక్షతో రొమ్ము క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని గుర్తించటం సులభం అవుతుంది. ‘మా కొత్త నమూనా మామోగ్రామ్ చిత్రంలో ఉండే కణజాలం లక్షణాలను విశ్లేస్తుంది. భవిష్యత్లో వచ్చే గుండె సమస్యలను కచ్చితంగా అంచనా వేయడానికి దోహదపడుతుంది’ అని పరిశోధకులు జెన్నిఫర్ చెప్పారు.