న్యూఢిల్లీ, నవంబర్ 14: ఏఐ (కృత్రిమ మేథ) అనే పదానికి ఇప్పుడున్న అర్థం వేరు. తన మేథస్సుతో మనిషి నిర్వర్తించే విధులకు సరికొత్త మాడల్..‘ఏఐ’ అంటూ కొలిన్స్ డిక్షనరీ నిర్వచించింది. ‘ఏఐ’ అన్న పదాన్ని 2023 వర్డ్ ఆఫ్ ఇయార్గా ఎంపికచేసింది.
టెక్నాలజీ, డిజిటల్ కల్చర్‌ను ‘ఏఐ’ ప్రభావితం చేసినంతగా మరోటి చేయలేదని పేర్కొన్నది. గత ఏడాది నవంబర్‌లో ‘చాట్‌జీపీటీ’ని కనుగొన్నాక, ఏఐ పదం పెద్దఎత్తున ప్రా చుర్యంలోకి వచ్చింది. ఆన్లైన్లో కోట్ల మంది ‘ఏఐ’ గురించి తెలుసుకుంటున్నారు.