న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో కూలిన(Ahmedabad Plane Crash) ఎయిర్ ఇండియా విమానానికి చెందిన బ్లాక్ బాక్సుల్లో ఉన్న డేటాను అధ్యయనం చేస్తున్నట్లు ఇవాళ కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పత్రికా ప్రకటన జారీ చేసింది. కాక్‌పిట్ వాయిస్ రికార్డ్స్(సీవీఆర్), ఫ్లయిట్ డేటా రికార్డ్స్(ఎఫ్డీఆర్) నుంచి సేకరించిన డేటాను విశ్లేషిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముందు ఉండే బ్లాక్ బాక్సు నుంచి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్‌ను సురక్షితంగా రిట్రీవ్ చేసినట్లు తెలిపారు. మెమోరీ మాడ్యూల్‌ను విజయవంతంగా తీశామని, దాంట్లో ఉన్న డేటాను ఏఏఐబీ డౌన్లోడ్ చేసినట్లు ప్రభుత్వం చెప్పింది.
సీవీఆర్, ఎఫ్డీఆర్ డేటా ఆధారంగా.. విమాన దుర్ఘటనకు కారణాలను కనుగొననున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకనటలో పేర్కొన్నది. విమానయాన భద్రతకు, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోనున్నట్లు సివిల్ యేవియేషన్ శాఖ తెలిపింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) .. అహ్మదాబాద్ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపడుతున్నది.
ఓ ఇంటి పైకప్పు నుంచి సీవీఆర్, ఎఫ్డీఆర్ రికవరీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సీవీఆర్‌ను జూన్ 13వ తేదీన , ఎఫ్‌డీఆర్‌ను జూన్ 16వ తేదీన వెలికితీసినట్లు చెప్పారు. అహ్మదాబాద్‌లో సీవీఆర్, ఎఫ్డీఆర్ డేటాకు భద్రత కల్పించామని, పోలీసులు, సీసీటీవీ నిఘాలో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. పూర్తి భద్రత మధ్య బ్లాక్ బాక్సులను అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి జూన్ 24వ తేదీన తరలించినట్లు తెలిపారు. ఫంట్, రియర్ బ్లాక్ బాక్సులు ప్రస్తుతం ఏఏఐబీ ల్యాబ్‌లో ఉన్నాయి.
Status Report on recovery and examination of data from Black Boxes –Air India Flight AI-171
The Crash Protection Module (CPM) from the front black box was safely retrieved on June 24, and on 25 June, the memory module was successfully accessed and its data downloaded at the AAIB… pic.twitter.com/JQ4Q85sYVg
— ANI (@ANI) June 26, 2025