Bihar deputy CM | గుజరాతీలే మోసగాళ్లన్న బీహార్ డిప్యూటీ సీఎం.. నోటీసులు జారీ చేసిన అహ్మదాబాద్ కోర్టు
Bihar deputy CM | గుజరాతీలే మోసగాళ్లంటూ అనుచిత కామెంట్స్ చేసిన కేసులో బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) కు అహ్మదాబాద్‌లోని మెట్రోపాలిటన్ కోర్టు (Metropolitan court) సమన్లు జారీచేసింది.
పట్నా: గుజరాతీలే మోసగాళ్లంటూ అనుచిత కామెంట్స్ చేసిన కేసులో బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) కు అహ్మదాబాద్‌లోని మెట్రోపాలిటన్ కోర్టు (Metropolitan court) సమన్లు జారీచేసింది. సెప్టెంబర్ 22న తేజస్వియాదవ్ కోర్టు ముందు విచారణకు హాజరు కావాలని అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ డీజే పర్మార్ (DJ Parmar) నోటిసులలో పేర్కొన్నారు.
అహ్మదాబాద్‌కు చెందిన 69 ఏళ్ల సామాజిక కార్యకర్త హరీశ్ మెహతా.. గుజరాతీల ఉద్దేశించి తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ మెట్రోపాలిటన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 499, 500 ప్రకారం తేజస్విపై కేసులు నమోదు చేశారు. ఈ పిటిషన్ విచారణ జరిపిన న్యాయస్థానం తేజస్వి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది.
తేజస్వియాదవ్ ఈ ఏడాది మార్చి 21న బీహార్ రాజధాని పట్నాలో ఓ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘గుజరాతీలే మోసగాళ్లు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో రికార్డులను కూడా హరీశ్ మెహతా కోర్టుకు సమర్పించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

