Electrocution : బైకు నీటి మడుగులో ఆగిపోయి కరెంటు షాక్ తగలడంతో దంపతులు మృతిచెందిన ఘటన చూపరులను కలచివేసింది. గుజరాత్ (Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలోని నరోల్ ఏరియా (Narol Area) లోగల మటన్ గలీలో సోమవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజన్, అంకితా సింఘాల్ అనే దంపతులు ఆస్పత్రిలో ఉన్న తమ బంధువును పరామర్శించి ఇంటికి తిరిగి వెళ్తుండగా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో వారు మటన్ గలీ ఏరియాకు రాగానే వారి బైకు ఓ నీటిగుంటలో నిలిచిపోయింది. దాంతో కిందకు అంకితకు కరెంట్ షాక్ తగిలింది. ఆమె కాపాడే క్రమంలో రాజన్‌కు కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.
స్థానికులు వెంటనే విద్యుత్ డిపార్టుమెంట్‌కు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఏరియాలో కరెంటును నిలిపేశారు. అనంతరం బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆ ఇద్దరు అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. అధికారులు విద్యుత్ లైన్లను సరిగా తనిఖీ చేయకపోవడంవల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు విమర్శిస్తున్నారు.