ఆగ్రా, జూలై 3: భర్తను హత్య చేసి బాత్రూమ్లో సమాధి చేసిన దారుణ ఘటన యూపీలోని ఆగ్రాలో చోటుచేసుకుంది. పైగా తన భర్త అదృశ్యమయ్యాడని గోడున విలపిస్తూ ఇరుగుపొరుగు వారిని నమ్మించడానికి ఆ మహిళ ప్రయత్నించింది. రూబీ అనే మహిళ కొద్ది రోజుల క్రితం తన భర్త సురేంద్ర శర్మ కన్పించడం లేదంటూ ఆగ్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన భర్త అద్యశ్యం తర్వాత తన హృదయం బద్దలైందంటూ ప్రతి రోజూ ఏడుస్తూ ఇరుగుపొరుగు వారిని నమ్మించడానికి ప్రయత్నించేది. అయితే రూబీపైనే తమకు అనుమానం ఉందంటూ మృతుని సోదరుడు పేర్కొనడంతో పోలీసులు ఆ దిశగా కేసును దర్యాప్తు చేశారు. అనుమానంతో ఇంటి బాత్రూమ్ టైల్స్‌ను తవ్వి చూడగా, భర్త సురేంద్ర శర్మ మృతదేహ అవశేషాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు రూబీని అరెస్ట్ చేశారు.