సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో శంకరాచార్యుల చాతుర్మాస్యవ్రత దీక్షలో భాగంగా శనివారం తిరుపతిలో అఖిల భారతీయ అగ్నిహోత్ర సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ హాజరై జగద్గురువుల ఆశీస్సులు తీసుకున్నారు.
కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి సత్యచంద్ర శేఖరేంద్ర సమక్షంలో 120 మంది వేద పండితులను గడ్కరీ సన్మానించారు.