న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట పేలుడుతో లింకున్న మూడవ కారు కోసం దర్యాప్తు సంస్థలు గాలిస్తున్నాయి. సోమవారం సాయంత్రం తెలుపు రంగు హుందయ్ ఐ20 కారుతో డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇక ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును ఫరీదాబాద్‌లో గుర్తించారు. ఉగ్రకుట్ర కోసం మూడు కార్లు వాడినట్లు తెలుస్తోంది. అయితే మూడవ కారు మారుతీ బ్రీజా కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆ కారు ఆచూకీ చిక్కడం లేదు. నిందితులు ఆ మూడవ కారును తప్పించుకోవడం కోసం వాడాలని భావించి ఉంటారని అనుమానిస్తున్నారు. దర్యాప్తు సంస్థలకు చెందిన బృందాలు ఆ కారు కోసం వేట కొనసాగిస్తున్నాయి. మారుతీ బ్రీజా కారును గుర్తించేందుకు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంతో పాటు సమీప రాష్ట్రాల్లోనూ పోలీసులు వెతుకుతున్నారు.
మరో వైపు పేలుడుతో మృతిచెందిన వారి సంఖ్య 13కు చేరింది. ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మరణించినట్లు గుర్తించారు. లాల్ ఖిలా మెట్రో స్టేషన్‌ను ఇవాళ కూడా మూసివేశారు. ఢిల్లీ మెట్రో దీనిపై ప్రకటన జారీ చేసింది. ఆత్మాహుతి దాడికి పాల్పడింది డ్రైవర్ ఉమర్ నబీయే అని డీఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ధారించారు. ఎర్రకోట సమీపంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన కారు పేలుడుకు సంబంధించిన కొత్త వీడియోను రిలీజ్ చేశారు.
#WATCH | Delhi | CCTV footage of the car blast near the Red Fort that claimed the lives of 8 people and injured many others.
Source: Delhi Police Sources pic.twitter.com/QeX0XK411G
— ANI (@ANI) November 12, 2025