Amritpal Singh’s wife | లండన్ పారిపోయేందుకు.. అమృత్‌పాల్ సింగ్ భార్య యత్నం
Amritpal Singh's wife | అమృత్‌పాల్ సింగ్ పరారీలో ఉండటంతో ఆయన భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను పంజాబ్ పోలీసులు ప్రశ్నించారు. వారిస్ పంజాబ్ డీ సంస్థకు విదేశీ నిధులను సమకూర్చడంతో ఆమె కీలకపాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్‌దీప్ కౌర్‌పై నిఘా ఉంచడంతోపాటు ఎల్వోసీ జారీ చేశారు.
అమృత్సర్: పరారీలో ఉన్న రాడికల్ సిక్కు నేత అమృత్‌పాల్ సింగ్ భార్య (Amritpal Singh’s wife) కిరణ్‌దీప్ కౌర్ లండన్‌కు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. పంజాబ్‌లోని అమృత్సర్ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ఈ సంఘటన జరిగింది. ఖలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు, వారిస్ పంజాబ్ డీ చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఛేజ్ చేయగా తప్పించుకున్నాడు. మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
కాగా, అమృత్‌పాల్ సింగ్ పరారీలో ఉండటంతో ఆయన భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను పంజాబ్ పోలీసులు ప్రశ్నించారు. వారిస్ పంజాబ్ డీ సంస్థకు విదేశీ నిధులను సమకూర్చడంతో ఆమె కీలకపాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్‌దీప్ కౌర్‌పై నిఘా ఉంచడంతోపాటు ఎల్వోసీ జారీ చేశారు. దీంతో గురువారం మధ్యాహ్నం 1.20 విమానంలో లండన్ వెళ్లేందుకు అమృత్సర్ విమానాశ్రయానికి వచ్చిన కిరణ్‌దీప్ కౌర్‌ను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. పోలీసులకు ఈ సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆమెను విమానాశ్రయంలో ప్రశ్నించారు.
మరోవైపు అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ ఎన్నారై. ఆమె పంజాబ్‌లో పుట్టినప్పటికీ తల్లిదండ్రులు బ్రిటన్‌లో స్థిరపడటంతో అక్కడ పెరిగింది. ఆమెకు సోషల్ మీడియా ద్వారా అమృత్‌పాల్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో గత ఏడాది ఫిబ్రవరిలో వారిద్దరికి పెళ్లి జరిగింది. నాటి నుంచి ఆమె పంజాబ్‌లోనే ఉంటున్నది. ఒక ఇంటర్వ్యూలో అమృత్‌పాల్ సింగ్‌ను మోడల్ భర్తగా కిరణ్‌దీప్ కౌర్ అభివర్ణించింది.
Also Read:
BRS Party | ఔరంగబాద్ జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు బీఆర్ఎస్ ప్రచార రథాలు
Pamela Chopra: యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా కన్నుమూత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Brs Party | ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు.. వీడియో
Sun Group | అనిరుధ్, కావ్య మారన్ వివాహ వేడుక.. ఉద్యోగులకు బంగారం కానుకగా ఇచ్చిన సన్ గ్రూప్!
‘కృష్ణా జలాల అక్రమ తరలింపును తక్షణమే ఆపాలి’
KTR | కేటీఆర్ చేతుల మీదుగా ‘ఏఐ కెన్ రైట్ ద కోడ్’ పుస్తకావిష్కరణ.. యువ ఇంజినీర్లకు నూతన దిశానిర్దేశం!
Thalasani Srinivas Yadav | బీఆర్ఎస్ హయాంలోనే మత్స్యరంగం అభివృద్ధి : మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

