Punjab Blasts: జలంధర్, అమృత్‌సర్‌లో పేలుళ్లు.. సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ, బీఎస్ఎఫ్
Punjab Blasts: పంజాబ్‌లో రెండు పేలుళ్ల ఘటనలు జరిగాయి. మంగళవారం రాత్రి జలంధర్‌లో తొలుత బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం వద్ద బ్లాస్ట్ జరిగింది. ఆ తర్వాత అర్థరాత్రి అమృత్‌సర్‌లో మరో పేలుడు ఘటన నమోదు అయ్యింది.
చండీఘడ్: పంజాబ్‌లో మంగళవారం రాత్రి రెండు పేలుళ్ల(Punjab Blasts) ఘటనలు జరిగాయి. జలంధర్‌లో తొలుత బీఎస్ఎఫ్ ప్రధానకార్యాలయం వద్ద బ్లాస్ట్ జరిగింది. ఆ తర్వాత అర్థరాత్రి అమృత్‌సర్‌లో మరో పేలుడు ఘటన నమోదు అయ్యింది. ఖాసా రోడ్డులో ఉన్న ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా సరిహద్దు గోడ వద్ద పేలుడు జరిగింది. గోడపై పెట్టిన ఓ షీట్ కిందపడిపోయింది.దేని వల్ల ఆ బ్లాస్ట్ జరిగిందో ఇంకా తెలియరాలేదు. కంటోన్మెంట్ ప్రాంతంలో స్వల్ప స్థాయి తీవ్రతతో పేలుడు జరిగిందని అమృత్సర్ రూరల్ ఎస్పీ సోహెల్ ఖాసిమ్ మీర్ తెలిపారు.
రాత్రి 11.15 నిమిషాల సమయంలో భారీ శబ్ధం వచ్చినట్లు తమకు సమాచారం వచ్చిందని, దీంతో హుటాహుటిన ఆ ప్రదేశానికి పోలీసు బృందాలు వెళ్లినట్లు ఆయన తెలిపారు. బౌండరీ వాల్ మీద ఉన్న ఓ షీట్ కిందపడిపోయినట్లు గుర్తించామన్నారు. క్విక్ రెస్పాన్స్ టీమ్స్, ఫోరెన్సిక్ నిపుణులు, బాంబు నిర్వీర్య దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఆర్మీ, బీఎస్ఎఫ్ బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి.
CCTV footage of the Jalandhar scooty blast outside BSF HQ. https://t.co/qBSvKJL2RO pic.twitter.com/cwCTkgq79V
— Elite Predators (@elitepredatorss) May 5, 2026
జలంధర్‌లోని బీఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్ దగ్గర తొలి పేలుడు ఘటన జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో బీఎస్ఎఫ్ కార్యాలయం సమీపంలో పార్క్ చేసిన స్కూటర్ పేలింది. తొలుత ఆ స్కూటర్‌కు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత అది పేలింది. సుమారు 300 మీటర్ల దూరం వరకు దాని ప్రభావం కనిపించింది. యాక్టివా స్కూటర్ పేలుడుకు చెందిన ఘటన దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

