ముంబై: కో ఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దీంతో ఖాతాదారులు ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో ఆ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ బ్యాంకు వద్ద గందరగోళం నెలకొన్నది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. బాంద్రాలోని న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ (New India Co-op Bank)పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 13 నుంచి ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండా బ్యాంకు రుణాలు మంజూరు చేయడం లేదా పునరుద్ధరించడం, పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త డిపాజిట్లను స్వీకరించడాన్ని నిషేధించింది.
కాగా, ఆ బ్యాంక్ ప్రస్తుత ద్రవ్యత స్థితి దృష్ట్యా పొదుపు లేదా కరెంట్ ఖాతాల నుంచి విత్‌డ్రాలు నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. నిర్దిష్ట షరతుల ప్రకారం డిపాజిట్లపై రుణాలను ఆఫ్సెట్ చేయడానికి అనుమతి ఇచ్చింది. అలాగే ఉద్యోగుల జీతాలు, అద్దె, విద్యుత్ బిల్లులు వంటి ముఖ్యమైన ఖర్చులకు నిధులను వినియోగించవచ్చని తెలిపింది. ఆరు నెలల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, ఆ తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ఒక ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు ఆర్బీఐ ఆంక్షల విషయాన్ని కస్టమర్లకు ఆ బ్యాంకు తెలియజేసింది. దీంతో బ్యాంకు ఖాతాదారులు ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృద్ధులు, మహిళలు తమ డిపాజిట్ పత్రాలు వెంటతెచ్చారు. నగదు విత్ డ్రా కోసం క్యూకట్టారు. అయితే బ్యాంకు సిబ్బంది అనుమతించకపోవడంతో కస్టమర్లు ఆందోళన చెందారు. దీంతో ఆ బ్యాంకు వద్ద గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
#WATCH | Mumbai, Maharashtra: People gather outside the New India Co-operative Bank after the RBI issued a notice to halt all business pic.twitter.com/kkzXmCIMqe
— ANI (@ANI) February 14, 2025
#WATCH | Mumbai: Seema Waghmare, a customer of the New India Co-operative Bank, says, “We deposited money just yesterday, but they did not say anything… They should have told us that this was going to happen… They are saying that we will get our money within 3 months… We… pic.twitter.com/wrIiQp472D
— ANI (@ANI) February 14, 2025