బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3(Chandrayaan-3) కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ సంస్థ అందజేస్తున్నది. మరో రెండు మూడు రోజుల్లో చంద్రుడిపై లూనార్ నైట్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో తాజాగా విక్రమ్ ల్యాండర్‌ను కూడా ‘స్లీప్ మోడ్’లోకి సెట్ చేసింది. సోమవారం ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు ఇస్రో పేర్కొంది. దీనికి ముందు ల్యాండర్‌లోని పేలోడ్స్‌ను మండించి సుమారు 40 సెంటీమీటర్ల ఎత్తుకు దానిని లేపినట్లు తెలిపింది. అలాగే 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో తిరిగి సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు వెల్లడించింది. ల్యాండర్ కొత్త లొకేషన్‌కు సంబంధించిన డేటా సమాచారం కంట్రోల్ సెంటర్‌కు చేరినట్లు పేర్కొంది. అలాగే ఆగస్ట్ 23న విక్రమ్ ల్యాండర్ దిగిన పాత లొకేషన్, ప్రస్తుతం అది ఉన్న కొత్త లొకేషన్‌కు సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేసింది.
కాగా, విక్రమ్ ల్యాండర్‌ను స్లీప్ మోడ్‌లో ఉంచడంతో దాని పేలోడ్స్‌ను డీయాక్టివ్ చేసినట్లు ఇస్రో తెలిపింది. అయితే ల్యాండర్ రిసీవర్స్ మాత్రం యాక్టివ్‌లో ఉన్నట్లు చెప్పింది. సోలార్ పవర్ తగ్గి బ్యాటరీ అయిపోయిన తర్వాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పూర్తిగా స్లీప్ మోడ్‌లో ఉంటాయని ఇస్రో తెలిపింది. చంద్రుడిపై తిరిగి లూనార్ డే మొదలైన తర్వాత సెప్టెంబర్ 22న ఈ రెండూ స్లీప్ మోడ్ నుంచి బయటకు వస్తాయని ఆశిస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొంది.
మరోవైపు భూ కాలమానం ప్రకారం ప్రతి 14 రోజులకు చంద్రుడిపై పగలు, రాత్రి ఏర్పడతాయి. లూనార్ నైట్ సమయంలో దక్షిణ ధృవం వద్ద ఉష్టోగ్రతలు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. సూర్య కాంతి ఏ మాత్రం ఉండదు. దీనివల్ల ల్యాండర్, రోవర్‌లోని సోలార్ ప్యానల్స్ విద్యుత్తును ఉత్పత్తి చేయలేవు. దీంతో అవి పనిచేయవు. ఈ నేపథ్యంలో లూనార్ నైట్ కాలంలో ల్యాండర్, రోవర్‌ను పరిరక్షించేందుకు ఇస్రో వాటిని స్లీప్ మోడ్‌లో ఉంచింది. లూనార్ డే మొదలైన తర్వాత వాటిని యాక్టివ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉన్న వాతావరణ పరిస్థితులను తట్టుకుని అవి తిరిగి పనిచేస్తాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అవి తిరిగి పని చేస్తే మూన్ మిషన్ చంద్రయాన్-3 కొనసాగుతుంది. లేనిపక్షంలో ఆ మిషన్ అక్కడితో ముగుస్తుంది.
Chandrayaan-3 Mission:
Vikram Lander is set into sleep mode around 08:00 Hrs. IST today.Prior to that, in-situ experiments by ChaSTE, RAMBHA-LP and ILSA payloads are performed at the new location. The data collected is received at the Earth.
Payloads are now switched off.… pic.twitter.com/vwOWLcbm6P— ISRO (@isro) September 4, 2023
Chandrayaan-3 Mission:
🇮🇳Vikram soft-landed on 🌖, again!Vikram Lander exceeded its mission objectives. It successfully underwent a hop experiment.
On command, it fired the engines, elevated itself by about 40 cm as expected and landed safely at a distance of 30 – 40 cm away.… pic.twitter.com/T63t3MVUvI
— ISRO (@isro) September 4, 2023