Watch: భక్తితో చోరి.. దేవుడ్ని ప్రార్థించి విగ్రహం దొంగిలించిన వ్యక్తి
Theft With Devotion | ఒక వ్యక్తి చాలా భక్తితో దొంగతనానికి పాల్పడ్డాడు. (Theft With Devotion) గుడిలోని దేవుడికి ప్రార్థించి అక్కడి విగ్రహాన్ని చోరీ చేశాడు. ఆలయంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: ఒక వ్యక్తి చాలా భక్తితో దొంగతనానికి పాల్పడ్డాడు. (Theft With Devotion) గుడిలోని దేవుడికి ప్రార్థించి అక్కడి విగ్రహాన్ని చోరీ చేశాడు. ఆలయంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 12న అబ్దుల్లాపూర్ ప్రాంతంలోని శివాలయంలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. తొలుత చాలా భక్తిభావాన్ని ప్రదర్శించాడు. అక్కడున్న దేవుళ్లకు దండం పెట్టి ప్రార్థించాడు. అంతలో బయటకు వెళ్లి ఎవరైనా వస్తున్నారేమోనని చూశాడు. తిరిగి గుడిలోకి వచ్చాడు. దేవుడి విగ్రహాన్ని ప్లాస్టిక్ కవర్లో ఉంచి అక్కడి నుంచి జారుకున్నాడు.
కాగా, ఆ గుడిలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు ఈ సంఘటనపై స్పందించారు. ఆ శివాలయంలో రాగితో చేసిన శివలింగంపై ఉన్న నాగదేవత విగ్రహాన్ని దొంగ ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఆ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Meerut,Uttar Pradesh: A thief absconded with the idol of the "Naag Devta" after a brief visit to the temple. pic.twitter.com/CBAlVtvdx5
— Mohd Shadab Khan (@VoxShadabKhan) March 12, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- god
- idol
- MAN
- Meerut Temple
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

