Jagdeep Dhankhar | న్యూఢిల్లీ: గురువారం రాజ్యసభలో విపక్ష సభ్యులకు, సభ చైర్మన్ జగదీప్ ధన్కర్కు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. టీఎంసీ, ఇతర విపక్ష ఎంపీల తీరుపై చైర్మన్ ధన్కర్ మండిపడ్డారు. సభను నడుపలేనంటూ తన సీట్లో నుంచి లేచి వెళ్లిపోయారు. భారత రెజ్లర్ వినేశ్ ఒలింపిక్స్లో అనర్హత వేటుకు గురైన అంశాన్ని విపక్ష నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గే లేవనెత్తగా, ధన్కర్ చర్చకు అనుమతించలేదు.
టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్, చైర్మన్ ధన్కర్ మధ్య కొంతసేపు మాటల యుద్ధం నడిచింది. సభ నుంచి బయటకు పంపుతానంటూ ఒబ్రెయిన్ను చైర్మన్ హెచ్చరించారు. దీంతో విపక్ష సభ్యులంతా లేచి నిలబడి గట్టిగా నినాదాలు చేయటంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.