బెంగళూరు: దివ్యాంగురాలైన కుమార్తె భవిష్యత్తు పట్ల తల్లి ఆందోళన చెందింది. ఆటిజం సమస్య ఎక్కువగా ఒక చిన్నారిని హత్య చేసింది. (Woman Kills Autistic Daughter) ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 35 ఏళ్ల మహిళకు కవల పిల్లలు. ఇద్దరు కుమార్తెలు ఆటిజం సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఒక కుమార్తెకు ఆటిజం సమస్య ఎక్కువగా ఉండగా మరో కుమార్తెకు స్వల్పంగా ఉంది.
కాగా, ఆటిజం సమస్య తీవ్రంగా ఉన్న మూడున్నర ఏళ్ల చిన్నారి భవిష్యత్తు గురించి ఆ తల్లి ఆందోళన చెందింది. కొన్ని రోజులుగా దీని గురించి దిగులుగా ఉన్న ఆమె గురువారం దారుణ నిర్ణయం తీసుకుంది. గొంతు నొక్కి కుమార్తెను హత్య చేసింది. అనంతరం సుబ్రమణ్య నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది.
మరోవైపు ఆ మహిళను పోలీసులు ప్రశ్నించారు. ఆటిజం సమస్య తీవ్రంగా ఉన్న కుమార్తె పెద్దయ్యాక ఎలా జీవిస్తుందో అన్న ఆందోళనతో చంపినట్లు ఆమె తెలిపింది. గత కొన్ని రోజులుగా తాను తీవ్రంగా మనస్థాపం చెందినట్లు చెప్పింది. దీంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం జైలుకు తరలించారు. పోస్ట్మార్టం తర్వాత చిన్నారి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మహిళ భర్త వేరే దేశంలో పని చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.