పాట్నా: బీజేపీతో మళ్లీ జతకలిసి మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్‌పై (Nitish Kumar) కొందరు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్జేడీ ప్రభుత్వం నుంచి వైదొలగిన ఆయన చనిపోయినట్లుగా చిత్రీకరించారు. ఒక దిష్టి బొమ్మ వద్ద ఈ మేరకు ఆక్రందనలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని హాజీపూర్‌లో ఈ సంఘటన జరిగింది. మహాఘట్బంధన్ ప్రభుత్వం నుంచి వైదొలిగి ఎన్డీయేతో కలిసిన జేడీ(యూ) చీఫ్ నితీశ్ కుమార్ తీరుపై హాజీపూర్ ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. నితీష్ కుమార్ దిష్టిబొమ్మను తయారు చేశారు. ఆ దిష్టిబొమ్మతో మాక్ డెత్ సీన్ క్రియేట్ చేశారు. ఆయన చనిపోయినట్లు ఏడ్చారు. ఇలా ఎందుకు (బీజేపీతో జతకట్టడం) చేశావంటూ ప్రశ్నించారు. ఈడీ లేదా సీబీఐ ఒత్తిడి వల్ల ఇలా చేశావా? అంటూ ఆర్తనాదాలు చేశారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. బీహార్ నేతలతోపాటు ఆ రాష్ట్ర ప్రజలు కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారని పలువురు ఫన్నీగా కామెంట్ చేశారు. ఆ రాష్ట్ర రాజకీయాలను పలువురు విమర్శించారు.
#WATCH | Hajipur: People protest against Bihar acting CM Nitish Kumar as he joined BJP-led NDA. pic.twitter.com/1lW4P1r55X
— ANI (@ANI) January 28, 2024