Watch: నిరసనకారుల నుంచి తప్పించుకునేందుకు.. బైక్‌పై పారిపోయిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
Giriraj Singh | శుంకుస్థాపన కార్యక్రమం కోసం వచ్చిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌ను నిరసనకారులు చుట్టుముట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. అయితే నిరసనకారుల నుంచి తప్పించుకునేందుకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పాట్నా: శుంకుస్థాపన కార్యక్రమం కోసం వచ్చిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh)ను నిరసనకారులు చుట్టుముట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. అయితే నిరసనకారుల నుంచి తప్పించుకునేందుకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెగుసరాయ్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆదివారం తన సొంత నియోజకవర్గంలో నిరసన సెగ ఎదుర్కొన్నారు. డాక్ బంగ్లా రోడ్డు వద్ద బాలికల పాఠశాల సమీపంలో పార్కు శంకుస్థాపన కార్యక్రమం కోసం అక్కడకు చేరుకున్నారు.
కాగా, తమ సమస్యల పరిష్కారం కోసం ఏఎన్ఎం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. గిరిరాజ్ సింగ్ కాన్వాయ్‌ను అడ్డుకుని వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే కారు నుంచి దిగిన ఆయన ఒకరి బైక్ వెనుక కూర్చొన్నారు. నిరసనకారులను తప్పించుకుని బైక్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు నిరసన చేస్తున్న ఏఎన్ఎం కార్యకర్తలు ఇది చూసి షాక్ అయ్యారు. వారంతా పరుగున స్కూల్ వద్దకు వెళ్లారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు. అయితే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ బైక్‌పై జారుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
अपने ही संसदीय क्षेत्र में केंद्रीय मंत्री का भारी विरोध: हड़ताली ANM ने गिरिराज सिंह के काफिले को रोका, गाड़ी छोड़कर बाइक से भागे बीजेपी नेता#Bihar #Biharnews pic.twitter.com/oDZ4oAMfu2
— FirstBiharJharkhand (@firstbiharnews) August 4, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

