Women journalists : ఆఫ్ఘనిస్థాన్ (Afhganistan) విదేశాంగ మంత్రి (Foreign minister) అమిర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) ఢిల్లీలో మరో ప్రెస్ మీట్ (Press meet) నిర్వహించారు. అయితే తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌కు ఆయన మహిళా జర్నలిస్టుల (Women journalists) ను ఆహ్వానించారు. ఢిల్లీలో గత శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు మహిళా జర్నలిస్టులను అనుమతించలేదు. దాంతో ఆయనపై, కేంద్ర సర్కారుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ్టి ప్రెస్ మీట్‌కు మహిళా జర్నలిస్టులను ఆహ్వానించడం గమనార్హం.
ఢిల్లీలోని ఆఫ్ఘనిస్థాన్ రాయబార కార్యాలయంలో గత శుక్రవారం ముత్తాఖీ మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించలేదు. దీనిపై కొందరు మహిళా జర్నలిస్టులు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తంచేశారు. దాంతో తాలిబన్ అధికారి వివరణ ఇచ్చారు.
ముత్తాఖీ ప్రెస్‌మీట్‌కు తాము ఉద్దేశపూర్వకంగా మహిళలను మినహాయించలేదని ఆ తాలిబన్ అధికారి వెల్లడించారు. మహిళలపై తమకు ఎలాంటి వివక్ష లేదని పాస్‌ల సంఖ్య పరిమితంగా ఉండడంతో కొందరినే ఆహ్వానించామని చెప్పారు. ఈ వ్యవహారంలో తమ ప్రమేయం ఏమీ లేదని కేంద్రం పేర్కొంది.