Congress Dares Arvind Kejriwal | దమ్ముంటే ‘ఇండియా’ కూటమి నుంచి వైదొలగాలి.. కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ సవాల్
Congress Dares Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నిజాయితీ లేని వ్యక్తుల్లో ఒకరిగా ఆప్ రిలీజ్ చేసిన పోస్టర్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై మండిపడింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నిజాయితీ లేని వ్యక్తుల్లో ఒకరిగా ఆప్ రిలీజ్ చేసిన పోస్టర్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై మండిపడింది. (Congress Dares Arvind Kejriwal) దమ్ముంటే ‘ఇండియా’ కూటమి నుంచి వైదొలగాలని కేజ్రీవాల్‌కు సవాల్ విసిరింది. ఢిల్లీలోని కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిని అల్కా లంబా ఆప్‌పై మండిపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా పెద్ద తప్పు చేశామని అన్నారు.
కాగా, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌లను అరవింద్ కేజ్రీవాల్ అవమానించారని అల్కా లంబా ఆరోపించారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘అరవింద్ కేజ్రీవాల్‌కు ధైర్యం ఉంటే, ‘ఇండియా’ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాలి. వంద మంది ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఢిల్లీలోని ఏడు ఎంపీ సీట్లను బీజేపీకి ఇచ్చింది అరవింద్ కేజ్రీవాలే’ అని అన్నారు. మరోవైపు బీజేపీకి బీ టీం ఆప్ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శించారు.
#WATCH | Delhi: Congress candidate from Kalkaji assembly constituency, Alka Lamba says, “…If Arvind Kejriwal has guts, he should announce that he is leaving the INDIA alliance. Congress party is standing strong with 100 MPs and Arvind Kejriwal is the one who gave all the 7… pic.twitter.com/LmPNrNvcNj
— ANI (@ANI) January 25, 2025
एक अकेला पड़ेगा सब पर भारी 🔥 pic.twitter.com/5jkvWaDXt4
— AAP (@AamAadmiParty) January 25, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- Arvind Kejriwal
- Congress
- dares
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

