Court Battle | 80 ఏళ్ల నాటి ఆస్తి వివాదానికి ముగింపు.. కోర్టులో గెలిచిన 93 ఏళ్ల వృద్ధురాలు
Court Battle | ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగిన ఆస్తి వివాదానికి కోర్టు ముగింపు పలికింది (Court Battle). రెండు ఫ్లాట్లకు వారసురాలైన 93 ఏళ్ల వృద్ధురాలికి వాటిని అప్పగించాలని తీర్పు ఇచ్చింది. 1942 మార్చి 28న నాటి డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం అప్పటి బ్రిటీష్ పాలకులు దక్షిణ ముంబైలోని రూబీ మాన్షన్ బిల్డింగ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ముంబై: ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగిన ఆస్తి వివాదానికి కోర్టు ముగింపు పలికింది (Court Battle). రెండు ఫ్లాట్లకు వారసురాలైన 93 ఏళ్ల వృద్ధురాలికి వాటిని అప్పగించాలని తీర్పు ఇచ్చింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 1942 మార్చి 28న నాటి డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం అప్పటి బ్రిటీష్ పాలకులు దక్షిణ ముంబైలోని రూబీ మాన్షన్ బిల్డింగ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం 1946 జూలైలో ఆ ప్రైవేట్ బిల్డింగ్ స్వాధీనం కోసం జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించారు. దీంతో ఆ బిల్డింగ్‌లోని ఫ్లాట్లు వాటి యజమానులకు తిరిగి సొంతమయ్యాయి. అయితే రూబీ మాన్షన్ మొదటి అంతస్తులో ఉన్న రెండు ఫ్లాట్లను మాత్రం వాటి యజమానులకు అప్పగించలేదు. నాడు అందులో నివసించిన ప్రభుత్వ అధికారి డీఎస్ లౌడ్ వారసులు ప్రస్తుతం అందులో ఉంటున్నారు.
కాగా ఆ రెండు ఫ్లాట్ల వారసురాలైన ఆలిస్ డిసౌజా వాటి కోసం ముంబై హైకోర్టును ఆశ్రయించారు. 80 ఏళ్ల నాటి ఈ ఆస్తి వివాదానికి కోర్టు ముగింపు ఇచ్చింది. ప్రస్తుతం 93 ఏళ్ల వయసున్న డిసౌజాకు ఆ రెండు ఫ్లాట్లు చెందుతాయని ద్విసభ్య ధర్మాసనం మే 4న తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం అందులో ఉంటున్న వారి నుంచి ఆ ఫ్లాట్లను స్వాధీనం చేసుకుని ఎనిమిది వారాల్లో అసలు వారసురాలైన ఆ వృద్ధురాలికి వాటిని అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

