న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాలలో ఇవాళ అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సుమారు 721 ఏళ్ల తర్వాత శుక్రవారం రోజున భోజ్‌శాల ఆలయంలో మహాహారతి(Bhojshala Maha Aarti) నిర్వహిస్తున్నారు. ధార్ జిల్లాలో ఉన్న ఆ ఆలయంలో ఇన్నాళ్లూ ముస్లింలు నమాజ్ చేశారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును ఇచ్చింది. భోజ్‌శాల సరస్వతీ దేవి ఆలయమని కోర్టు తన తీర్పులో వెల్లడించిన విషయం తెలిసిందే.భోజ్‌శాల ఆలయ పరిసరాల్లో సుమారు 1800 మంది బలగాలను మోహరించారు. మే 15వ తేదీన తీర్పు వచ్చిన తర్వాత అక్కడ తొలి శుక్రవారం కావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య కట్టుదిట్టమైన భద్రత మధ్య కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు.
ఇవాళ ఉదయం సరస్వతీ దేవికి హారతి నిర్వహించారు. ఇక మధ్యప్రదేశ్ హైకోర్టును సవాల్ చేస్తూ ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కమల్ మౌలా మసీదుకు చెందిన కేర్‌టేకర్ ఖ్వాజి మొయినుద్దీన్.. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు.2024లో ఆర్కియాలజీ శాఖ నిర్వహించిన సర్వే ద్వారా.. భోజ్‌శాల ఆలయాన్ని సరస్వతీ దేవి ఆలయంగా గుర్తించారు. ఆ గుడి ఆవరణలో సంస్కృత భాషలో రాతలు ఉన్నట్లు తేల్చారు. ఓ హవన కుండం, ఆలయ కళావైభవానికి చెందిన ఆనవాళ్లు ఉన్నట్లు పురావస్తు శాఖ తెలిపింది.
#WATCH | Morning aarti being performed at Bhojshala temple, dedicated to Goddess Saraswati, in Dhar, following the Madhya Pradesh High Court order.
After the court order, no Friday namaz is allowed at the Bhojshala complex. pic.twitter.com/2p8XEfOHaf
— ANI (@ANI) May 22, 2026