న్యూఢిల్లీ, మే 18: చీతాల సంరక్షణలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి వాటిని రాజస్థాన్‌కు తరలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. నమీబియా, సౌతాఫ్రికా దేశాల నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు తెచ్చిన మొత్తం 20 చీతాలలో రెండు నెలల వ్యవధిలోనే మూడు మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ధర్మాసనం గురువారం పేర్కొంది. చీతాల ఆవాసానికి కునో పార్క్ విస్తీర్ణం సరిపోదన్న నిపుణుల వాదన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.