Kerala gold smuggling case | కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేశ్‌కు బెయిల్
Kerala gold smuggling case | దేశంలో సంచలనం సృష్టించిన డిప్లొమాటిక్ పాస్ పోర్టుల ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి కేరళకు

తిరువనంతపురం : దేశంలో సంచలనం సృష్టించిన డిప్లొమాటిక్ పాస్ పోర్టుల ద్వారా యూఏఈ నుంచి కేరళకు భారీ ఎత్తున బంగారం అక్రమ రవాణా కేసులో 15 నెలలుగా జైలులో ఉంటున్న ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్‌కు ఊరట లభించింది. మంగళవారం కేరళ హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. రూ.25లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ఎన్ఐఏ యూఏపీఏ కింద కేసు నమోదు చేసింది.
బెయిల్‌పై విచారణ సందర్భంగా ఎన్ఐఏ బెయిల్ ఇవ్వొద్దని, నిందితురాలి బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేయాలని అభ్యర్థించింది. ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీట్లోని ఆరోపణలు చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ)చట్టం (యూఏపీఏ)కు సంబంధం లేదని, ఆమెతో సంబంధం ఉన్న ఆధారాలను వెల్లడించలేదని స్వప్న సురేశ్ తరఫున న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ కే వినోద్ చంద్రన్, జస్టిస్ జయచంద్రన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే పీ మహ్మద్ షఫీ, ఏఎం జలాల్, రబిన్స్ హమీద్, రమీస్ కేటీ, షరాఫుదీన్ కేటీ, సరిత్ పీఎస్, మహ్మద్ అలీలకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25లక్షల పూచీకత్తు బాండ్ అందించాలని ఆదేశించింది. బంగారం స్మగ్లింగ్ కేసులో దాదాపు 15 నెలలకుపైగా స్వప్న సురేశ్ జైలు శిక్ష అనుభవించారు. ఆమె ప్రస్తుతం తిరువనంతపురంలోని అట్టకులంగార మహిళా జైలు నుంచి విడుదలకానున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

