కోల్కతా: మోదీ సర్కారు అట్టహాసంగా ప్రారంభించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానంతో తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని ప్రధానమంత్రి ఆర్థిక సలహాసంఘం చైర్మన్ వివేక్ దెబ్రాయ్ తెలిపారు. పన్నుల విధింపు, వసూళ్లను జీఎస్టీ సరళతరం చేసిందని మంగళవారం ఆయన అన్నారు. ‘కేంద్ర ఆర్థికశాఖ వివరాల ప్రకారం జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు సగటు జీఎస్టీ 17% విధించాలని అనుకొన్నారు. కానీ, ప్రస్తుతం అది 11.4% ఉన్నది. అందుకే పన్ను ఆదాయం పడిపోయింది. సామాన్యులతోపాటు జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు కూడా 28% పన్ను శ్లాబును తగ్గించాలని కోరుతున్నారు. కానీ, 0-3% ఉన్న శ్లాబును పెంచాలని మాత్రం ఎవరూ కోరటం లేదు’ అని పేర్కొన్నారు.