న్యూఢిల్లీ : ఇంటర్నెట్లో కొన్ని వీడియోలు (Viral Video) మనం ఎంత చికాకులో ఉన్నా మన ముఖాలపై నవ్వులు పూయిస్తుంటాయి. వారం ఆరంభంలో నెటిజన్లలో నయా జోష్ నింపేలా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ చిన్నారి తన అన్నకు సారీ చెబుతుండటం కనిపిస్తుంది. చిన్నారి క్షమాపణ కోరినా అన్న అంటీముట్టనట్టుగా వ్యవహరించడం ఈ వైరల్ క్లిప్‌లో చూడొచ్చు.
ఏడాదిన్నర వయసు కలిగిన చిన్నారి అవిర, తన అన్న విహాన్‌కు సారీ చెబుతున్న వీడియోను వారి తల్లి సుమన చౌధరి తన ఇన్స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 50 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ క్లిప్‌లో పాప పలుమార్లు భయ్యా సారీ అని చెబుతుండటం వినిపిస్తుంది. ఎన్ని సార్లు సారీ చెప్పినా ఆమె అన్న మంకుపట్టు వీడకపోవడంతో అతడిని కొట్టేస్తానని బెదిరించడం క్యూట్ వీడియోలో చూడొచ్చు.
Read More
OG Movie | పవన్ కోసం పవర్ ఫుల్ ఇంట్రో.. సుజీత్ మాస్టర్ ప్లాన్