OG Movie Latest Update | పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతం ఒజీ నామమే జపం చేస్తున్నారు. ఒక్క ప్రీ లుక్ పోస్టర్ తోనే సినిమాపై తిరుగులేని హైప్ వచ్చింది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్టేడ్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. పైగా ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు పవన్ ‘పంజా’లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించాడు. మళ్లీ ఇనేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టర్ పాత్ర చేస్తుండటంతో సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. అంతేకాకుండా ఈ సినిమాలో పవన్ మూడు విభిన్న వేరియేషన్స్ లో కనిపించనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
కాగా ఈ సినిమా కోసం సుజీత్ పవర్ ఫుల్ ఇంట్రో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు పవన్ సినిమాల్లో అలాంటి ఇంట్రో లేదట. ఇప్పటికే దానిపై కసరత్తులు కూడా స్టార్ట్ చేశాడట. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఖైదీ ఫేమ్ అర్జున్ దాస్ కీలకపాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కోసం పవన్ 60రోజుల కాల్షీట్లు ఇచ్చాడని తెలుస్తుంది. ఇక ఈ ఏడాది చివరి కల్లా టాకీ పార్ట్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలిని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.