న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో తనతోపాటు తన కుమారుడిపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీలోని ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. రఘురామకృష్ణంరాజు, ఆయన కుమారుడు భరత్, ఆయన వ్యక్తిగత సిబ్బంది తనపై దాడి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్ c 2022లో తెలంగాణ పోలీసులకు ఫిర్యా దు చేశారు. గచ్చిబౌలి పోలీసులు రఘురామ, భరత్పై కేసు నమోదు చేశారు. తమ కేసును కొట్టివేయాలని వారు హైకోర్టును ఆశ్రయించగా నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై సోమవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ రాజేశ్ బిందాల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఈ పిటిషన్పై ఎందుకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. కొంత గడువు కోరగా, ఆ మేరకు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.