బెంగళూరు, డిసెంబర్ 2: సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో పంపిన ‘ఆదిత్య ఎల్-1’ ఉపగ్రహం విజయం దిశగా దూసుకెళ్తున్నది. ఈ ఉపగ్రహంలో కీలకమైన పేలోడ్ సోలార్ విండ్ పార్టిక్లి ఎక్స్పిరిమెంట్ తన పనిని ప్రారంభించింది. ఇందులోని రెండు పరికరాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చే సౌర గాలులను ఈ పరికరాలు రికార్డు చేశాయి. భూమిపై సౌరగాలుల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడనున్నది.