న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అదానీ, అంబానీ డబ్బులు పంపితే వారికి వ్యతిరేకంగా తాను మాట్లాడనని అన్నారు. కాంగ్రెస్ నేతలకు టెంపోల్లో డబ్బులు చేరాయన్న ప్రధాని మోదీ ఆరోపణలపై ఒక ఇంటర్వ్యూలో అధిర్ రంజన్ బదులిచ్చారు. ఆ డబ్బు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తాను దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) వ్యక్తినని, తనకు డబ్బు చాలా అవసరమని తెలిపారు. ‘నేను పేదవాడిని. ఎన్నికల్లో పోటీకి నా దగ్గర డబ్బు లేదని బహిరంగంగా చెబుతున్నా. డబ్బు లేకపోతే ఎన్నికల్లో పోరాడడం చాలా కష్టంగా ఉంటుంది. నాకు టెంపో నిండా అవసరం లేదు. అదానీ ఒక బ్యాగు డబ్బు పంపిస్తే సరిపోతుంది’ అని అన్నారు.
కాగా, డబ్బు పంపితే మీరు పార్లమెంటులో వారికి వ్యతిరేకంగా మాట్లాడతారా? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అధిర్‌ను అడిగాడు. ‘అవును, వారు మాకు డబ్బు పంపరు కాబట్టి నేను మాట్లాడతా. వారు పంపితే ప్రజలు సైలెంట్ అవుతారు’ అని అధీర్ చెప్పారు. అంటే డబ్బు అందితే సైలెంట్ అయిపోతారా? అని ఇంటర్వ్యూయర్ అడిగారు. దీనికి అధీర్ నవ్వుతూ, ‘ముందు వారు పంపనివ్వండి’ అని అన్నారు.
మరోవైపు ఈడీ, సీబీఐ ఉన్నాయి కదా అని ఇంటర్వ్యూ వ్యక్తి అడగ్గా, ఈడీకి ఎవరు భయపడుతున్నారు? అని అధిర్ ప్రశ్నించారు. ‘ఈడీ ఇడియట్. అది ప్రధాని మోదీ చెప్పినట్లుగా డ్యాన్స్ చేస్తుంది. ఆపై కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత విడుదల చేస్తుంది. చూడండి, కేజ్రీవాల్‌ను కూడా విడుదల చేస్తారు’ అని ఆయన అన్నారు.
కాగా, అధిర్ రంజన్ మాట్లాడిన వీడియో క్లిప్‌ను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల్ ఎక్స్‌లో షేర్ చేశారు. డబ్బు సంచులు అందితే, పార్లమెంటులో ఏదైనా సమస్య గురించి మౌనంగా ఉంటారని, వారికి డబ్బు రాకపోతే, రచ్చ సృష్టిస్తారని ఆయన (అధీర్) బహిరంగంగా చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్, భారత కూటమి అసలు ‘హఫ్తా వసూలీ మోడల్’ను అధిర్ బయటపెట్టారని ఆరోపించారు.
Asli Hafta Vasooli Model of Congress & INDI
पार्लियामेंट में अड़ानी अंबानी को बुरा भला इसलिए कहते है कि नोट भरकर पैसे नहीं भेजते, अगर भेजते तो नहीं कुछ कहेंगे- Adhir Ranjan Chowdhury
We shout against Adani Ambani because they don’t send sacks of money
If they send we won’t… pic.twitter.com/iwTLxFFFXY— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) May 12, 2024