Adani Group | సాగు చట్టాలు తీసుకొచ్చింది రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కాదు.. అదానీ జేబు నింపేందుకే.. సంచలన విషయాలు వెల్లడించిన రిపోర్టర్స్ కలెక్టివ్
Adani Group |రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న నెపంతో వివాదాస్పద మూడు సాగుచట్టాలను కేంద్రప్రభుత్వం తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆప్తమిత్రుడికి చెందిన అదానీ గ్రూప్ కూడా కీలక భూమిక పోషించింది. రైతులపై పరోక్షంగా పెత్తనం చెలాయించాలనుకోవడమే కాదు.. అన్నదాతల కష్టాన్ని పరోక్షంగా దోచుకోవాలనుకొన్నది. ఈ మేరకు ప్రముఖ జర్నలిస్ట్ ఫోరమ్ వెబ్సైట్ ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్' మరో పరిశోధనాత్మక పత్రంలో వెల్లడించింది.
Adani Group | ఆరుగాలం శ్రమించి రైతన్న పండించిన పంటను అగ్గువ సగ్గువకు కొనెయ్యాలి. అలా వేల టన్నుల్లో సేకరించిన ధాన్యాన్ని గోదాముల్లో నింపెయ్యాలి. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి.. ఎక్కువ రేటుకు ధాన్యాన్ని అమ్మేయాలి. మిగిలిన పంటను ఎక్కువ రేటుకు విదేశాలకు ఎగుమతి చేయాలి. ఇదంతా జరుగాలంటే, పంట ఉత్పత్తుల నిల్వలపై ఉన్న ఆంక్షలను ఎత్తేయించాలి. మరెలా?? వివాదాస్పద మూడు సాగు చట్టాలను తీసుకురావాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయంలో అదానీ గ్రూప్ కూడా కీలక పాత్ర పోషించింది. ఈ మేరకు ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ మరో పరిశోధన పత్రంలో వెల్లడించింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న నెపంతో వివాదాస్పద మూడు సాగుచట్టాలను కేంద్రప్రభుత్వం తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆప్తమిత్రుడికి చెందిన అదానీ గ్రూప్ కూడా కీలక భూమిక పోషించింది. రైతులపై పరోక్షంగా పెత్తనం చెలాయించాలనుకోవడమే కాదు.. అన్నదాతల కష్టాన్ని పరోక్షంగా దోచుకోవాలనుకొన్నది. ఈ మేరకు ప్రముఖ జర్నలిస్ట్ ఫోరమ్ వెబ్సైట్ ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ మరో పరిశోధనాత్మక పత్రంలో వెల్లడించింది.
కుట్రకు తెరతీశారిలా..
నీతిఆయోగ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీలో ఎలాంటి వ్యవసాయ అనుభవంలేని బీజేపీ సన్నిహితుడు, ఎన్నారై టెకీ శరద్ మరాఠే సభ్యుడుగా చేరినట్టే, మూడు నల్ల చట్టాల్లో తమకు అనుకూలమైన కొత్త నిబంధనలను చేర్చడంలో అదానీ గ్రూప్ కూడా కీలక పాత్ర పోషించింది. రిపోర్టర్స్ కలెక్టివ్ కథనం ప్రకారం.. నిత్యావసర వస్తువుల చట్టం, 1955 ప్రకారం.. దేశంలో ధాన్యం ధరలను నియంత్రించడానికి కేంద్రం కొన్ని నిబంధనలను తీసుకొచ్చింది. మార్కెట్లో వ్యాపార సంస్థలు మోతాదుకు మించి ధాన్యాన్ని నిల్వచేయకూడదని అందులో పేర్కొంది. అయితే, 2018 ఏప్రిల్‌లో అదానీ గ్రూప్ నీతిఆయోగ్ టాస్క్‌ఫోర్స్‌కు ఓ విజ్ఞప్తి చేసింది. ధాన్యం నిల్వలపై ఉన్న పరిమితుల ఆంక్షలను ఎత్తేయాలని కోరింది. దీంతో నిల్వలపై ఆంక్షలను ఎత్తేస్తున్నట్టు మూడు నల్లచట్టాల్లో భాగంగా కేంద్రప్రభుత్వం వెల్లడించింది.
అదానీకి లాభదాయకంగా..
కేంద్రం నిర్ణయం ముఖ్యంగా అదానీ గ్రూప్‌నకే లాభం చేకూర్చేలా ఉన్నదని రిపోర్టర్స్ కలెక్టివ్ అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా వేలాది గోదాములు, రైల్వే ర్యాక్‌లు, పోర్టులు అదానీ గ్రూప్‌నకు ఉండటమే దీనికి కారణంగా వెల్లడించింది. రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యాన్ని కొని, గోదాముల్లో నిల్వచేసి, మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించి.. అప్పుడు ఆ ధాన్యాన్ని ఎక్కువ ధరకు విక్రయించడానికే అదానీ గ్రూప్ నిల్వ నిబంధనలను ఎత్తివేయించిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాగో పోర్టులు, ఎయిర్‌పోర్టులు ఆ గ్రూప్ ఆధీనంలోనే ఉండటంతో.. అగ్గువసగ్గువకు కొనుగోలు చేసిన ఆ ధాన్యాన్ని అదానీ గ్రూప్ విదేశాలకు ఎక్కువ రేట్లకు ఎగుమతి చేయాలనుకొన్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఏడాదిన్నరపాటు రైతన్నలు చేసిన నిరసనోద్యమంతో కేంద్రప్రభుత్వం దిగిరావడం.. నల్లచట్టాలను వెనక్కి తీసుకోవడంతో అదానీ పాచిక పారకుండా పోయినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

