Agriculture Acts | మోదీ తీసుకొచ్చిన సాగు చట్టాల వెనుక ఉన్నది ఓ ఎన్నారై.. అతని ఐడియాతో రైతుల ఉసురు తీసేందుకు కుట్ర!
Agriculture Acts | రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ గత కొన్నేండ్లుగా ప్రధాని నరేంద్రమోదీ ఊదరగొడుతూనే ఉన్నారు. అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడం మాట అటుంచితే, మూడు సాగు చట్టాలను తీసుకొచ్చిన కేంద్రం.. సుమారు 750 మంది రైతుల మరణానికి కారణమైంది. దీంతో వ్యవసాయాన్ని కార్పొరేట్‌పరం చేయడానికి కేంద్రం యత్నించడం, నల్లచట్టాలు తీసుకురావడం.. వంటివి ఎవరి సిఫారసులు? అన్న విషయం అప్పట్లో పెద్దయెత్తున చర్చనీయాంశమైంది.
Agriculture Acts | ఒక్క బియ్యపు గింజను పండించడానికి రైతన్న చిందించే స్వేదం విలువ ఏసీ గదుల్లో, చెమట అంటే ఏమిటో తెలియని ఓ టెకీకి తెలుస్తుందని అనుకోగలమా?
ఎక్కడో అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీని నడిపిస్తున్న ఓ వ్యక్తి.. మన అన్నదాతల తలరాతను రాద్దామనుకొన్నాడు. తలాతోకా లేని సలహాలిచ్చాడు. వాటికి బీజేపీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ గత కొన్నేండ్లుగా ప్రధాని నరేంద్రమోదీ ఊదరగొడుతూనే ఉన్నారు. అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడం మాట అటుంచితే, మూడు సాగు చట్టాలను తీసుకొచ్చిన కేంద్రం.. సుమారు 750 మంది రైతుల మరణానికి కారణమైంది. దీంతో వ్యవసాయాన్ని కార్పొరేట్‌పరం చేయడానికి కేంద్రం యత్నించడం, నల్లచట్టాలు తీసుకురావడం.. వంటివి ఎవరి సిఫారసులు? అన్న విషయం అప్పట్లో పెద్దయెత్తున చర్చనీయాంశమైంది. అయితే దీనివెనుక బీజేపీ సన్నిహితుడు, ఎన్నారై, వ్యాపారవేత్త శరద్ మరాఠే అనే ఓ టెకీ కీలక భూమిక పోషించినట్టు ప్రముఖ జర్నలిస్ట్ ఫోరమ్ వెబ్సైట్ ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ ఓ పరిశోధన పత్రంలో వెల్లడించింది. రిపోర్టర్స్ కలెక్టివ్ కథనం ప్రకారం.. శరద్ మరాఠే అమెరికాలో ఓ వ్యాపారవేత్త. యూనివర్సల్ టెక్నికల్ సిస్టమ్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని నిర్వహిస్తున్నారు. బీజేపీకి సన్నిహితుడు. 2016లో యూపీలో నిర్వహించిన ఓ సభలో మోదీ మాట్లాడుతూ.. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ హామీనిచ్చారు. దీంతో వ్యవసాయరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతు నేతల నుంచి సలహాలు, సూచనలను తీసుకోడానికి నీతిఆయోగ్ సమాయత్తమైంది. అయితే, ఏంజరిగిందో ఏమో.. చివరకు ఎలాంటి వ్యవసాయ అనుభవంలేని శరద్ ఇచ్చిన సూచనలను నీతిఆయోగ్ 2017లో ఫైనల్ చేసింది. ఆయన సూచనల మేరకు ‘స్పెషల్ టాస్క్‌ఫోర్స్’ పేరిట ఓ కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా అందులో ఆయన్ని సభ్యుడిగా నియమించింది.
ఏమిటో.. అంత గొప్ప సలహాలు?
2017 అక్టోబర్‌లో నీతిఆయోగ్‌కు శరద్ కార్పొరటైజ్ అగ్రికల్చర్ (కార్పొఅగ్రి)ని ప్రోత్సహించేలా కొన్ని సిఫారసులు చేశారు. రిపోర్టర్స్ కలెక్టివ్ కథనం ప్రకారం.. కార్పొరేట్ కంపెనీలు రైతు దగ్గర నుంచి భూమిని లీజుకు తీసుకొంటాయి. అందులో చిన్న కంపెనీలు పంటలు పండించి ప్రాసెసింగ్ చేస్తాయి. వాటిని పెద్ద కార్పొరేట్ కంపెనీలు మార్కెటింగ్ చేస్తాయి. రైతుకు లాభాల్లో కొంత మేర చెల్లిస్తారు. కార్పొరేట్ కంపెనీలు ఆధునిక సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం చేస్తాయి కాబట్టి.. దిగుబడి పెరిగి రైతు ఆదాయం కూడా రెట్టింపు అవుతుందని శరద్ తన రిపోర్ట్‌లో చెప్పుకొచ్చారు. నిపుణులతో చర్చించకుండానే ఈ సిఫారసులకు ప్రభుత్వం 2018లో ఆమోదం తెలిపింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడాని కోసమని వ్యవసాయ నిపుణులతో సంప్రదించి అంతర్గత మంత్రిత్వశాఖలోని కమిటీ ఒకటి 3,000 పేజీలతో నివేదిక తయారుచేసింది. అయితే, ఆ నివేదికను పక్కనబెట్టిన కేంద్రం.. శరద్ సూచనలకే మొగ్గుచూపింది. సాగు చట్టాల తయారీలో శరద్ సూచనలనే ప్రామాణికంగా తీసుకొన్నది. అయితే, కార్పొరేట్ కంపెనీల పెత్తనాన్ని ప్రోత్సహించేలా ఉన్న ఈ చట్టాలను రైతన్నలు వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలో ఏడాదిన్నరపాటు నిరసనోద్యమం చేయడంతో కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది. నల్ల చట్టాలను వెనక్కి తీసుకొన్నది. శరద్ సూచనల రిపోర్ట్‌ను పబ్లిక్ డొమైన్ నుంచి కూడా ప్రభుత్వం తొలగించింది. కాగా, సాంప్రదాయ వైద్య పద్ధతులను పర్యవేక్షించే ఆయుష్ మినిస్ట్రీకి చెందిన టాస్క్‌ఫోర్స్ టీమ్‌కి.. ఆ రంగంలో ఎలాంటి అనుభవం లేని శరద్‌ను ఛైర్మన్‌గా కేంద్రం నియమించినట్టు రిపోర్టర్స్ కలెక్టివ్ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి


