న్యూఢిల్లీ: అదానీ గ్రూపు(Adani Group)పై అమెరికా న్యాయశాఖ చేసిన ఆరోపణలను ఆ కంపెనీ కొట్టిపారేసింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని ఆ కంపెనీ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ అదానీ సంస్థ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం అదానీ గ్రీన్ కంపెనీకి చెందిన డైరెక్టర్లు.. అమెరికా పెట్టుబడీదారులకు ముడుపులు ఇచ్చే ప్రయత్నం చేసినట్లు అమెరికా కోర్టు పేర్కొన్నది. ఆ కేసులో గౌతం అదానీతో పాటు మరో ఏడుగురికి అరెస్టు వారెంట్ జారీ చేసింది.
అమెరికా న్యాయశాఖ ప్రకారం.. నేరాభియోగాలు కేవలం ఆరోపణలు మాత్రమే అని, దోషులుగా తేలే వరకు డిఫెండెంట్లను అమాయకులుగా భావించాలని కోర్టు చెప్పినట్లు ఆ స్టేట్మెంట్లో తెలిపారు. అమెరికా న్యాయశాఖ ఇచ్చిన తీర్పుపై లీగల్ చర్యలు తీసుకోనున్నట్లు అదానీ సంస్థ వెల్లడించింది.
అత్యున్నత స్థాయి పరిపాలన, పారదర్శకతకు కట్టుబడి అదానీ గ్రూపు పనిచేస్తుందన్నారు. తమ సంస్థ చట్టానికి లోబడి పనిచేస్తుందని వాటాదారులకు, భాగస్వామ్యులకు, ఉద్యోగులకు చెబుతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Know more: https://t.co/uNYlCaBbtk pic.twitter.com/fQ4wdJNa9d
— Adani Group (@AdaniOnline) November 21, 2024