ముంబై : ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించి ఆదుకోవడంలో ముందుండే సోనూ సూద్ సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వీధి శునకం పట్ల ప్రేమను చూపుతూ సోనూ సూద్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఓ రైల్వే స్టేషన్ బెంచ్‌పై కూర్చున్న సోనూ సూద్ వీధి కుక్కను ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం కనిపించింది.
మీకెప్పుడైనా జంతువులు కంటపడితే వాటిపై ప్రేమను చూపండని ఆయన ప్రజలను కోరారు. వీధి శునకాన్ని తాను తీసుకోవాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఈ వీడియో క్లిప్‌కు ఇప్పటివరకూ పది లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. పెద్దసంఖ్యలో నెటిజన్లు ఈ క్లిప్‌పై రియాక్ట్ అయ్యారు. సోనూ సూద్ నిరాడంబరతను పలువురు మెచ్చుకుంటున్నారు.