చెన్నై: ప్రముఖ నటుడు రజనీకాంత్ బుధవారం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ను చెన్నైలోని ఆయన నివాసంలో కలిశారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ భేటీలో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయినందుకు రజనీకాంత్ సంఘీభావం తెలియజేసినట్టు సమాచారం. గతంలో దేశ రాజకీయాల్లోని దిగ్గజ నేతల్లో ఒకరిగా స్టాలిన్ను రజనీకాంత్ ప్రశంసించారు. ఈ సంవత్సరం మార్చిలో టీవీకే నాయకుడు అధవ్ అర్జున మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థను మార్చాలని రజనీకాంత్ బలంగా కోరుకున్నప్పటికీ డీఎంకే బెదిరింపుల వల్ల ఆయన ఆ పని చేయలేదని ఆరోపించారు. దీనిపై వెంటనే రజనీకాంత్ లేఖ రాస్తూ ‘కాలం మాట్లాడదు..కానీ అది వేచి చూసి సమాధానం చెప్తుంది’ అని వ్యాఖ్యానించారు.