Loksabha Elections 2024 : నటుడు, కాంగ్రెస్ అభ్యర్ధి రాజ్ బబ్బర్ గురుగ్రాంలో 30,000 ఓట్లు పైగా ఆధిక్యంలో ముందుకు సాగుతున్నారు. బీజేపీ అభ్యర్ధి రావు ఇంద్రజిత్ సింగ్‌పై రాజ్ బబ్బర్ ఆధిక్యంలో ఉన్నారు. హరియాణలోని 10 లోక్‌సభ స్ధానాల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ పోరు సాగుతోంది.
కాషాయ పార్టీ 4 స్ధానాల్లో గెలుపు దిశగా సాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ 6 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ దిగ్గజం కుమారి సెల్జా సిర్సా స్ధానంలో బీజేపీ అభ్యర్ధి అశోక్ తన్వర్‌పై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో దూసుకుపోతున్నారు.
రోహ్తక్లో కాంగ్రెస్ సీనియర్ నేత దీపీందర్ సింగ్ హుడా బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ శర్మపై లక్ష ఓట్లకు పైగా ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి నువ్వానేనా అనేలా తలపడుతున్నాయి.
Read More :
Amritpal Singh | ముందంజలో ఖలిస్థానీ నేత అమృత్‌పాల్ సింగ్