న్యూఢిల్లీ : 37 ఏండ్ల సుదీర్ఘ విచారణ తర్వాత రూ.50 లంచం తీసుకున్నారన్న ఆరోపణల కేసులో ఓ టీటీఈ నిర్దోషిగా తేలారు. అయితే తుది తీర్పు వచ్చే లోగానే ఆయన చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన చట్టబద్ధ వారసులకు ఆయన పింఛను, ఇతర ఆర్థిక ప్రయోజనాలను మూడు నెలల్లోగా అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మే 31, 1988లో ముగ్గురు రైల్వే ప్రయాణికుల నుంచి సదరు టీటీఈ రూ.50 లంచం తీసుకున్నారని విజిలెన్స్ బృందం ఆరోపించింది. 1996లో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు.