Acharya Devvrat | మహారాష్ట్ర గవర్నర్ (Maharashtra Governor)గా గుజరాత్ గవర్నర్ (Gujarat Governor) ఆచార్య దేవవ్రత్ (Acharya Devvrat) ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం ముంబైలోని రాజ్భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు.
కాగా, ఇటీవలే జరిగిన ఉపరాష్ట్రపతి (Vice-President) ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మహారాష్ట్ర గవర్నర్ (Maharashtra Governor) పదవి నుంచి వైదొలిగారు. ఈనెల 12న భారత 15వ ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆయన రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో గుజరాత్ గవర్నర్ (Gujarat Governor) ఆచార్య దేవవ్రత్కు (Acharya Devvrat) మహారాష్ట్ర గవర్నర్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.
#WATCH | Mumbai: Acharya Devvrat takes oath as the Governor of Maharashtra.
CM Devendra Fadnavis and Deputy CM Ekanth Shinde also present. pic.twitter.com/66YLDBTzz9
— ANI (@ANI) September 15, 2025
Also Read..
Mumbai Monorail | హఠాత్తుగా ఆగిపోయిన మోనో రైలు.. ప్రయాణికులు సేఫ్
Triple Talaq | కోర్టు బయటే తలాక్.. భర్తను చెప్పుతో చితకబాదిన భార్య.. VIDEO
Assam | భారీ భూ ప్రకంపనలు.. నవజాత శిశువుల రక్షణకై నర్సుల సాహసం.. VIDEO