Home
National
Accident With Devotees Returning After Visiting Mata Vaishno Devi Bus Fire 3 Killed 22 Injured
కత్రాలో బస్సులో చెలరేగిన మంటలు.. ముగ్గురు భక్తుల దుర్మరణం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కత్రాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలువురు భక్తులు శ్రీమాత్ర వైష్ణోదేవిని దర్శించుకొని తిరిగి బస్సులో వస్తున్న క్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగి ముగ్గురు భక్తులు మృతి చెందగా, 22 మంది భక్తులు గాయపడ్డారు. వారిని కత్రాలోని సీహెచ్‌సీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కత్రా నుంచి జమ్మూకు తిరిగి వస్తున్న సమయంలో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. అయితే, బస్సులో పేలుడు సంభవించిందని, ఆ తర్వాత మంటలు చెలరేగాయని పలువురు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

